Sircilla: గణపతి సాక్షిగా మద్యం, మాంసం నిషేధంపై గ్రామస్తుల ప్రమాణం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్‌లో గణపతి సాక్షిగా నిమజ్జనం వరకు మద్యం, మాంసాహారాన్ని నిషేధిస్తూ కాలనీ వాసులు ప్రమాణం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 10:06 PM IST
Sircilla
X

Sircilla: గణపతి సాక్షిగా మద్యం, మాంసం నిషేధంపై గ్రామస్తుల ప్రమాణం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలోని బేడ బుడగ జంగాల కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి మండపంలో భక్తులు ప్రత్యేక ప్రమాణం చేశారు.

గణపతి సాక్షిగా తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నియమ నిష్టలతో నిర్వహిస్తామని కాలనీ వాసులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు కాలనీలో మద్యం, మాంసాహారం నిషేధించాలని నిర్ణయించుకుని ప్రమాణం చేశారు.

గ్రామ పురోహితులు రేపాక రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి సాక్షిగా నియమ నిష్టలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కాలనీ వాసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బంధనకల్ గ్రామ సర్పంచ్ చిగురు నరేష్ అభినందించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కాలనీ వాసులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA