Peddapalli: దసరా నాటికి పెద్దపల్లికి ఆర్టీసీ డిపో ఎమ్మెల్యే విజయరమణరావు!

Peddapalli: పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలో నూతన ఆర్టీసీ బస్సు సేవలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు.

RAJU, PEDDAPALLI
Published on: 1 Aug 2026 1:00 PM IST
Peddapalli
X

Peddapalli: దసరా నాటికి పెద్దపల్లికి ఆర్టీసీ డిపో ఎమ్మెల్యే విజయరమణరావు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పెద్దపల్లి నుంచి చొప్పదండి వరకు నడిచే నూతన ఆర్టీసీ బస్సు సేవలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఈ బస్సు సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.కాళేశ్వరం నుంచి నీటి అవసరం లేకుండానే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండాయని, పెద్దపల్లి జిల్లాలో నీటి కొరత లేదని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం జిల్లాపై లేదని, ప్రస్తుతం నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో వరి నాట్లు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.అభివృద్ధిని చూసి విమర్శలు చేసే వారు "ఏడుస్తూనే ఉంటారు" అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.

పెద్దపల్లి జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, దసరా నాటికి డిపోను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ చైర్మన్ నరేష్ ముదిరాజ్ , సర్పంచ్ గోగు రాజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story