Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్, విపక్షాలపై బీజేపీ నేత సునీల్ ఫైర్!
Karimnagar: నీట్ పేరుతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నేత సునీల్ రావు మండిపడ్డారు. బండి సంజయ్ ఆఫీస్‌పై దాడి, నిరుద్యోగ హామీలు నెరవేర్చాలన్నారు.
Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్, విపక్షాలపై బీజేపీ నేత సునీల్ ఫైర్!
కరీంనగర్: దేశంలో అల్లర్లు సృష్టించడానికి కాక్రోచ్ నీట్ పరీక్ష పేరుతో రాజకీయం చేస్తుంటే సందులో సడే మియాలా కాంగ్రెస్ దాన్ని ఎక్కువ చేస్తుందని బిజెపి అధికార ప్రతినిధి సునీల్ రావు అన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.
విద్యార్థులు ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఐ కాలేజీలలో చేరుదామని చూస్తా ఉంటే కాక్రోచ్ పార్టీతో కలిసి కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా చేస్తే అరెస్టు చేస్తే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టడం తగదని హెచ్చరించారు. నిన్న నగరంలో కాంగ్రెస్ నాయకులు శాంతియుత ర్యాలీ అని కార్యాలయం మీదికి దాడికి రావడం అందులో ఒక ఎమ్మెల్యే ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు....
అవినీతి మచ్చ లేకుండా పాలిస్తున్న బిజెపి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. NDA అడ్డుకోలేక ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు. బోద్దింకల పార్టీ కి విదేశాల నుంచి ఫండింగ్ పెట్టి భారతదేశాన్ని ఎదుగుదలను అడ్డుకునేందుకు చూస్తున్నారు. భారతదేశాన్ని కాపాడుతున్న భారత సైన్యంపై నీచమైన విమర్శలు చేస్తున్నారు. ఈ బుద్ధింకల వెనక దేశం వ్యతిరేక దేశాల హస్తం ఉందన్నారు. నీట్ ఎగ్జామ్ గురించి ఆందోళన చేస్తే నీట్ ఎగ్జాం గురించే ఆందోళన చేయాలి కానీ వేరే దేశాల లెక్క చేస్తామని మాట్లాడుతున్నారు. స్వసంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎన్ని ఎగ్జామ్స్ లీక్ అయ్యాయో వారికి తెలవదా, ఏ ఒక్క మంత్రైన రాజీనామా చేసిన సంఘటన ఉందా అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు, బాధ్యత లేదు...
రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసింది, రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చారా ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు చెప్పాలన్నారు. మహిళలకు స్కూటీలు విద్యార్థులకు ఆర్థిక సహాయాలు ఏమయ్యాయి? రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాటకాలాడుతుందన్నారు.
కేంద్ర మంత్రి కార్యాలయం పై దాడి చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు...
నిరసనలు తెలపడం ప్రజల హక్కు. కానీ పార్టీ కార్యాలయాలు సొంతభవనాలపైకి దాడికి రావడం ఏంటి అని అన్నారు. నిన్న కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ శాంతి యుతంగా నిరసన చేశారు మేమేమీ అనలేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం లోకి వెళ్లేందుకు వచ్చారు. కేంద్ర మంత్రి కార్యాలయం పై దాడి చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు అందుకే ఘర్షణ జరిగింది. కరీంనగర్లో రాజకీయ దాడులు పెరిగాయని ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలకాలని అన్ని పార్టీలను కోరుతున్నానని తెలిపారు.




