Sircilla: సిరిసిల్ల మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల మినీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. ప్రతిభ కనబరిచిన 20 మంది క్రీడాకారులకు సన్మానం, బహుమతుల ప్రదానం.

KALEEM, SIRICILLA
Published on: 29 Aug 2026 5:27 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు!

Sircilla: మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల మినీ స్టేడియంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు.రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు గోల్డ్, సిల్వర్ మెడల్స్, మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

అలాగే జాతీయ స్థాయిలో వివిధ క్రీడాంశాల్లో పాల్గొని విజయం సాధించిన 20 మంది క్రీడాకారులను ప్రత్యేకంగా సత్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నోడల్ అధికారి డి. ప్రభాకర్, వాలీబాల్ అకాడమీ కోచ్‌లు, కబడ్డీ కోచ్, క్రీడాకారులు, తల్లిదండ్రులు, యూత్ అసోసియేషన్ సభ్యులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారు 210 మంది పాల్గొని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story