Jammikunta: కొత్తపల్లి పల్లె దవాఖానలో జాతీయ నాణ్యతా బృందం తనిఖీ!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో నాణ్యతా ప్రమాణాలు, వైద్య సేవలను నేషనల్ క్వాలిటీ టీమ్ వర్చువల్ విధానంలో పరిశీలించింది.

GANESH, JAMMIKUNTA
Published on: 1 Sept 2026 8:04 PM IST
Jammikunta
X

Jammikunta: కొత్తపల్లి పల్లె దవాఖానలో జాతీయ నాణ్యతా బృందం తనిఖీ!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన)కు నేషనల్ క్వాలిటీ సర్వీసెస్ అసిస్మెంట్ టీం జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికెట్ కోసం నాణ్యత ప్రమాణాల పరిశీలన కొరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఏమేమి ఉన్నాయి పేషెంట్లకు ఇచ్చిన మందులు సర్వీసెస్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారని జాతీయస్థాయి గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తారని డిప్యూటీ డిహెచ్ఎంఓ డాక్టర్ ప్రభుదాస్ హుజురాబాద్ తెలుపుతూ డివిజన్ లో ఉన్న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలకు జాతీయస్థాయి గుర్తింపు రావడం కొరకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో. నేషనల్ టీం ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి అస్సేసర్స్ డాక్టర్ దినేష్ కుమార్,డాక్టర్ జియార్జ్ ఇమ్మానియేల్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పోల్నేని అజయ్ రావు, వైద్యాధికారులు డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, సి హెచ్ ఓ దిలీప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, డిపిఓ స్వామి,డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, క్వాలిటీ ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్, సూపర్వైజర్ కొండపాక సదానందం,క్వాలిటీ అసిస్టెంట్ అఖిల్,ఏఎన్ఎంలు వాణి,మంజుల,శ్రీముఖ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story