Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, చేనేత కార్మికులను సన్మానించారు.

KONDAL, SULTANABAD
Published on: 7 Aug 2026 12:52 PM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు!

Peddapalli: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయ ఆవరణలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి చేనేత కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించాలని, కార్మికులకు మద్దతుగా సబ్సిడీలు, ఆధునిక యంత్రాలు అందించాలని కోరారు. ప్రాచీన కళను కాపాడుతూ దేశ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

​ప్రజలందరూ వారంలో కనీసం ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించి, కార్మికుల జీవనోపాధికి చేయూతనందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కోమటిపల్లి సదానందం నేత, పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు గోలి సుధాకర్, మండల అధ్యక్షులు సబ్బని రాయమల్లు, జిల్లా ప్రచార కార్యదర్శి ఓడ్నాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి-రాజు, కార్యదర్శి చేరాల శంకర్, కోశాధికారి రమేష్, ఉపాధ్యక్షులు వోడ్నాల రాజన్న, గోలి రమణయ్య గోలి కేశవులు

పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story