Manthani: మంథని హామాలి సంఘం అధ్యక్షుడిగా నర్ర ఓదెలు విజయం
Manthani: Hamali Sangh, Peddapalli district news, Manthani news, Narra Odelu, Katuku Anil, Hamali workers union, Manthani local news, Telangana labor news
Manthani: మంథని హామాలి సంఘం అధ్యక్షుడిగా నర్ర ఓదెలు విజయం
మంథని హామాలి సంఘం అధ్యక్షుడిగా నర్ర ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా కటుకు అనిల్ విజయం
Manthani మంథని హామాలి సంఘం అధ్యక్షుడిగా నర్ర ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా కటుకు అనిల్ ఎన్నికయ్యారు. ఆదివారం మంథని పట్టణంలోని హామాలి సంఘం కార్యాలయంలో సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కాసేట్టి సురేష్ వ్యవహరించారు.
అధ్యక్ష పదవికి నర్ర ఓదెలు, రంగు కొమురయ్య పోటీ పడగా నర్ర ఓదెలు విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి పదవికి కటుకు అనిల్, రంగు శంకర్ పోటీ పడగా కటుకు అనిల్ గెలుపొందారు.
కార్యవర్గ సభ్యులుగా బిరుదు శంకర్, మేకు రవి, మర్రిపల్లి సది, రాపాక సమ్మయ్య, కారి కుమార్, చిట్టవేన కుమార్, గడి కళ్యాణ్, బుక్క పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నర్ర ఓదెలు, ప్రధాన కార్యదర్శి కటుకు అనిల్ మాట్లాడుతూ హామాలి కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు.




