Mustabad: చీకోడులో ఓటర్ల సమగ్ర సవరణ పరిశీలించిన కలెక్టర్!

Mustabad: సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చీకోడులో ఎస్ఐఆర్ హియరింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. నోటీసులు అందుకున్న ఓటర్లు హాజరుకావాలని సూచన.

KALEEM, SIRICILLA
Published on: 8 Sept 2026 2:09 PM IST
Mustabad
X

Mustabad: చీకోడులో ఓటర్ల సమగ్ర సవరణ పరిశీలించిన కలెక్టర్!

Mustabad: ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

ముస్తాబాద్ మండలం చీకోడులో నిర్వహించిన హియరింగ్ సమావేశానికి కలెక్టర్ హాజరై SIR ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో నో మ్యాపింగ్, అనామలీస్ కేటగిరీలకు చెందిన 7,005 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకుని హియరింగ్‌కు రావాలని కలెక్టర్ తెలిపారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ తేదీ, సమయం గురించి సమాచారం అందించి, ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.

తహసీల్దార్లు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో SIR ప్రక్రియను పర్యవేక్షించాలని, బీఎల్‌ఓలు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

అలాగే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈఆర్‌ఓ/ఏఈఆర్‌ఓ కార్యాలయాల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలతో పాటు ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

సమావేశంలో ఆర్డీవో శ్రీధర్ బాబు, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story