Mustabad: గూడెంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
Mustabad: ముస్తాబాద్ మండలం గూడెంలో ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించి, మౌలిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు.
Mustabad: గూడెంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు.
గూడెంలో ఆరు బ్లాక్‌లలో మొత్తం 48 ఇళ్లు జీ+ విధానంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయా ఇళ్లలో ప్రస్తుతం ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి, వారికి అందుతున్న మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.
అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన బోర్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఈ సాజిద్, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.




