Mustabad: ముస్తాబాద్‌లో రోడ్డు ప్రమాదం టిప్పర్‌ను ఢీకొన్న బైక్

Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కంకర టిప్పర్‌ను ఢీకొన్న బైక్. మల్లారెడ్డిపేట వాసి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.

KALEEM, SIRICILLA
Published on: 16 Aug 2026 8:56 PM IST
Mustabad
X

Mustabad: ముస్తాబాద్‌లో రోడ్డు ప్రమాదం టిప్పర్‌ను ఢీకొన్న బైక్

ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడెం–ఆవునూరు మార్గమధ్యంలోని పెట్రోల్ బంక్ సమీపంలో కంకర టిప్పర్‌ను ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన యాదిరెడ్డిగా గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story