Karimnagar: టవర్ సర్కిల్ లో మున్సిపల్ అధికారుల మెగా డ్రైవ్ చెత్త క్లీన్!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్ మార్కెట్ లో సఫాయి అప్నా-బీమారీ భగావో కార్యక్రమంలో భాగంగా 3 టన్నుల చెత్తను తొలగించారు.
Karimnagar: టవర్ సర్కిల్ లో మున్సిపల్ అధికారుల మెగా డ్రైవ్ చెత్త క్లీన్!
కరీంనగర్: " సఫాయి అప్నా... బీమారీ భగావో" కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్యం, ఎన్విరాన్‌మెంటల్ విభాగం అధికారులు, కార్మికులు " స్పెషల్ డ్రైవ్" చేపట్టారు. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన టవర్ సర్కిల్ ప్రాంతం మార్కెట్ ఏరియాలో కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారులను భాగస్వామ్యం చేస్తూ చుట్టూ పరిసరాలను పరిశుభ్రం చేశారు.
ప్రధాన గార్బేజ్ పాయింట్లలో పేరుకుపోయిన దాదాపు 3 టన్నుల చెత్తను కార్మీకులు, సిబ్బంది తొలగించారు. టవర్ సర్కిల్ వ్యాపార దుకాణాల యజమానులకు పరిసరాల పరిశుభ్రత, తడి-పొడి చెత్త వేరు చేయడం పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి షాపు యజమాని తమ దుకాణం ముందు తప్పనిసరిగా చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి..చెత్తను రోడ్లు, డ్రెయిన్లలో పడేయకుండా డబ్బాల్లో సేకరించాలని సూచించారు. సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి ప్రతిరోజు వచ్చే 'స్వచ్ఛ ఆటో' కార్మికులకు అందించాలన్నారు.
నగరాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో వ్యాపారులు, స్థానిక ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. ప్రస్తుత వర్షకాలంలో నగర పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాదుల వస్తాయని ఎప్పటికప్పుడు మీ చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య అధికారులు, కార్మీకులు పాల్గొన్నారు.




