Jammikunta: జమ్మికుంటలో విత్తన గణపతుల పంపిణీ: చైర్మన్ ప్రశాంత్ కుమార్!
Jammikunta: జమ్మికుంటలో విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
Jammikunta: జమ్మికుంటలో విత్తన గణపతుల పంపిణీ: చైర్మన్ ప్రశాంత్ కుమార్!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో వినాయక చవితి పురస్కరించుకూని ఏర్పాటు చేయనున్న విఘ్నేశ్వరుని విత్తన మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ప్రతి సంవత్సరం విత్తన మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మట్టి గణపతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి,మట్టి గణపతినే పూజించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు పర్యావరణ పరిరక్షణ కోసం జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు.




