jagtial: ఎమ్మార్పీఎస్ కొడిమ్యాల మండల నూతన కమిటీ ఎన్నిక!

jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఎమ్మార్పీఎస్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ANAND, JAGITYAL
Published on: 24 Aug 2026 7:22 PM IST
jagtial
X

jagtial: ఎమ్మార్పీఎస్ కొడిమ్యాల మండల నూతన కమిటీ ఎన్నిక!

జగిత్యాల: ఎస్సీ వర్గీకరణ సాధించినంత మాత్రాన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముగియదని, ఇకపై సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పోరాడతామని ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి రేణుకుంట్ల సాగర్ మాదిగ స్పష్టం చేశారు.

సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కొడిమ్యాల-మల్యాల మండలాల ఇన్చార్జి బోనగిరి కిషన్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కొడిమ్యాల మండల కమిటీ ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు "పద్మశ్రీ" మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల్లో నూతన కమిటీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కేవలం మాదిగలకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్ని అణగారిన వర్గాల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ పోరాడి ఇతర సామాజిక సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

నూతన కమిటీ ఎన్నిక:

ఈ సమావేశంలో కొడిమ్యాల మండల ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు బండారి నరేష్ మాదిగ, ఉపాధ్యక్షులు గుండు రమేష్ మాదిగ, బండారి దేవదాస్ మాదిగ, ప్రధాన కార్యదర్శి ఎలగుర్తి విజయ్ మాదిగ, అధికార ప్రతినిధి బొమ్మెన శ్రీనివాస్ మాదిగ, కార్యదర్శి బొడ్డు మహేష్ మాదిగ, కోశాధికారి పేదూరు రవి మాదిగ, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు దుమాల గంగారాం మాదిగతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story