Kalva Srirampur: మొట్లపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు: పాల్గొన్న సర్పంచ్
Kalva Srirampur: కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి.
Kalva Srirampur: మొట్లపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు: పాల్గొన్న సర్పంచ్
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 06: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులకు సర్పంచ్ తులా మనోహర్ రావు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించడంతో పాటు ప్రభుత్వం ఉచితంగా అందించిన యూనిఫామ్‌లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనోహర్ రావు మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఎలాంటి కల్తీ, కల్మషం లేనివి కేవలం తల్లి పాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అత్యంత పోషకాలు కలిగిన తల్లి పాలను అందించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, తల్లులు ఖచ్చితంగా బిడ్డలకు పాలు ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బాలామృతం, పౌష్టికాహారం, గుడ్లను గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు.
అంగన్వాడీ కార్యకర్త సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మెల సుమలత సదయ్య, వార్డు సభ్యులు రాందేని రాజేశం, అనుముల రమేష్, దొమ్మటి పోచాలు, బెజ్జాల సంపత్, దొమ్మటి శంకరమ్మ-చంద్రయ్య, గాదర్ల శారద-మొండయ్య, బెజ్జాల మానస-రవి, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, జీపీఓ స్వాతి, హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి, సీఏలు రాణి, ఉమా, గొనె భారతి, ఏఎల్ఎం వెంకటేష్, ఆశా కార్యకర్త కృష్ణవేణి, ఆయాలు లక్ష్మి, భారతి, మాజీ వార్డు సభ్యుడు సముద్రాల రాజేశంతో పాటు తల్లులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




