Peddapalli: పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన!
Peddapalli: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పర్యటన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ పెద్దపల్లిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
Peddapalli: పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన!
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.ఆయన మాట్లాడుతూ "దళిత బహుజనులు అంటే బీజేపీ పార్టీకి ఇష్టం లేదా?" అని ప్రశ్నించారు.
దళిత నాయకుడి పర్యటన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హీనమైన చర్య అని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించాలని, అంబేద్కర్ సాక్షిగా దళిత బహుజన సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులు, బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




