Manakondur: మానకొండూర్ లింకు రోడ్లకు రూ. 58.25 కోట్ల నిధులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
Manakondur: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషితో మానకొండూర్‌లో 75 కిమీ మేర రోడ్ల మంజూరు. తిమ్మాపూర్ మండలంలో సీఎం, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం.
Manakondur: మానకొండూర్ లింకు రోడ్లకు రూ. 58.25 కోట్ల నిధులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
మానకొండూర్: మానకొండూర్ నియోజకవర్గ అభివృద్దికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేస్తున్న కృషి అభినందనీయమని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి రమేష్ అన్నారు. నియోజకవర్గంతోపాటు తిమ్మాపూర్ మండలంలో లింకు రోడ్లకు నిధులు కేటాయించిననందుకు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సీఎం, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బండారి రమేష్ మాట్లాడుతూ పదేళ్లుగా అభివృద్దికి నోచుకోని రోడ్ల అభివృద్దికి రాష్ర్ట ప్రభుత్వం నిదులు కేటాయించిందని, ఇందుకు సీఎం, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సత్యనారాయణ ఎంతో కృషి చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 75 కిలోమీటర్ల మేరకు 58 కోట్ల 25 లక్షలు నిధులు మంజూరైనట్లు తెలిపారు.
తిమ్మాపూర్ మండలంలో తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు, రాంహనుమాన్ నగర్ నుండి జూగుండ్ల వరకు, పోలంపల్లి నుండి దుద్దెనపల్లి వరకు, కొత్తపల్లి నుండి బాలయ్యపల్లె గ్రామాల వరకు రోడ్ల నిమిత్తం నిధులు మంజూరయ్యాయని, దీంతో ప్రయాణికులు, వాహనదారులకు, రైతులకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా నిధుల మంజూరికి కృషి చేశారని తెలిపారు.
నిధులు కేటాయించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో సమస్యలన్నింటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, పొరండ్ల చైర్మన్ గోపు మల్లారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు కొత్త తిరుపతిరెడ్డి , ఎస్ ఎల్ గౌడ్, పోలు రాము, రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నబోయిన రవి , తొర్తి అరవింద్, మాచర్ల అంజయ్య, శ్రీగిరి రంగారావు ,మామిడి అనిల్, చింతల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.




