Karimnagar: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ బంద్ నేపథ్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్.
Karimnagar: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
కరీంనగర్: కరీంనగర్ బందుకు పిలుపు ఇవ్వడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి జరిగిన నేపథ్యంలో టిఆర్ఎస్ శ్రేణులు ఈరోజు బందుకు పిలుపునిచ్చాయి. వాణిజ్య వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంధు చేయాలని టిఆర్ఎస్ శ్రేణులు ఒకరోజు ముందు నుండి పిలుపునిచ్చాయి. బిజెపి నాయకులు బందును వివలం చేయాలని వ్యాపార సంస్థలకు ఉంటాం మీరు సజావుగా వ్యాపారం చేసుకొని దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరవ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించి నాయకులను ముందస్తుగానే అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎంపీ కార్యాలయం వద్ద ఉన్న లీడర్లను కూడా హౌస్ అరెస్టు చేశారు.




