Jagtial: మున్సిపల్ డ్రైవర్‌కు రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత!

Jagtial: అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల మున్సిపల్ డ్రైవర్ జుట్టు జగన్‌కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.

ANAND, JAGITYAL
Published on: 9 Sept 2026 11:33 PM IST
Jagtial
X

Jagtial: మున్సిపల్ డ్రైవర్‌కు రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత!

జగిత్యాల: అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల మున్సిపల్ డ్రైవర్ జుట్టు జగన్ కుటుంబానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అండగా నిలిచారు. స్థానిక నాయకుల ద్వారా జగన్ అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేయించి, హైదరాబాద్‌లో బాధితుడి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎల్‌ఓసీ అందజేసినందుకు ఎమ్మెల్యేకు జగన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళ ధర్మారం మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story