Sircilla: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటన!
Sircilla: జూలై 30న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటించి, వేములవాడ ట్యాంక్‌బండ్ పార్కు, రగుడు జంక్షన్‌ను ప్రారంభించనున్నారు.
Sircilla: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటన!
సిరిసిల్ల: వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం (జూలై 30) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఉదయం 9 గంటలకు వేములవాడ చేరుకోనున్న మంత్రులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. అనంతరం గుడిచెరువు ట్యాంక్‌బండ్ పార్కును ప్రారంభించి, తిప్పాపూర్ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు సిరిసిల్లకు చేరుకుని రగుడు బైపాస్ జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. అలాగే రగుడు జంక్షన్ వద్ద నూతన బస్ షెల్టర్‌ను ప్రారంభించడంతో పాటు ఐడీఓసీలో ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.




