sircilla: ఆరుతడి పంటలే మేలు సన్న వడ్ల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
sircilla: రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం, ఎల్ నినో పరిస్థితులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్షించారు.
sircilla: ఆరుతడి పంటలే మేలు సన్న వడ్ల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
సిరిసిల్ల: లోటు వర్షపాతం, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వానాకాలం సాగు, నీటి లభ్యత, రైతులకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి హాజరయ్యారు.
రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని మంత్రులు తెలిపారు.
ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, యూరియా పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేస్తే బోనస్ లభిస్తుందని రైతులకు వివరించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సాంకేతిక సలహాలు అందించాలని, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.




