Manthani: చెరువు కట్ట పనులను పరిశీలించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
Manthani: మంథని రావుల చెరువు కట్ట పనులను పరిశీలించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
Manthani: చెరువు కట్ట పనులను పరిశీలించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా పరిశీలించారు. జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన. మంత్రి పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అవసరమైతే రాత్రి వేళలో అధికారుల సమక్షంలో యంత్రాలతో పనులను చేయాలని అలాగే స్థానిక ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
అలాగే మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించిన డ్రైనేజీ సమస్యపై స్పందించిన మంత్రి, డ్రైనేజీ దారిని వెంటనే మళ్లించి పనులు ప్రారంభించాలని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారుపాక నీహారిక, జంబోజు శ్రీమతి, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, టీజీఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచె, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




