Manthani: మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
Manthani: మంథనిలో సమీకృత ఆర్డీవో కార్యాలయం, ఆసుపత్రి, మున్సిపల్ భవనాల నిర్మాణ పనులను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
Manthani: మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
జిల్లా: పెద్దపల్లి
నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
Manthani పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.




