Sircilla: మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ వద్ద కార్లతో ప్రమాదకర విన్యాసాలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి శివారులోని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ వద్ద పర్యాటకులు కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేశారు.
Sircilla: మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ వద్ద కార్లతో ప్రమాదకర విన్యాసాలు!
Sircilla: మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ వద్ద పర్యాటకుల అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తోంది. తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి శివారులోని బ్యాక్‌వాటర్‌ను చూసేందుకు హైదరాబాద్ నుంచి సుమారు 50 వాహనాల్లో పర్యాటకులు తరలివచ్చారు.
చుట్టూ గుట్టలు వాటిని ఆనుకుని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ కనుచూపు మేర పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రాంతంలో పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు.
అయితే సమీపంలోని మైదానంలో కొందరు పర్యాటకులు కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేయడం కలకలం రేపింది. వేగంగా వాహనాలు నడుపుతూ స్టంట్స్ చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ప్రమాదకర విన్యాసాల వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నిబంధనలు ఉల్లంఘించే వారిని అడ్డుకోవాలని కోరుతున్నారు.




