Sircilla: మిడ్ మానేరు గేట్లు బంద్.. అధికారుల అర్జెంట్ అప్‌డేట్ ఇదే!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక మిడ్ మానేరు జలాశయం వద్ద నీటి నిల్వలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
Sircilla: మిడ్ మానేరు గేట్లు బంద్.. అధికారుల అర్జెంట్ అప్‌డేట్ ఇదే!
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు వద్ద నీటి నిల్వలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.ఉదయం 6 గంటల సమయానికి జలాశయం నీటి మట్టం 307.23 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 అడుగులు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 7.649 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
జలాశయానికి ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదుకాలేదు. ఎస్సారెస్పీ, ఎస్‌వైపీ (జీపిహెచ్), మానేరు, మూలవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీటి ప్రవాహం లేకపోవడం గమనార్హం. అవుట్‌ఫ్లో పరంగా మొత్తం 140 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో ఆవిరి కారణంగా 95 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఆర్‌ఎస్, ఆర్‌జీ, ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, ప్యాకేజ్-9, ప్యాకేజ్-10, జీసీఎల్‌ఎస్ మార్గాల ద్వారా ఎలాంటి నీటి విడుదల జరగడం లేదు. అదేవిధంగా జలాశయం స్పిల్‌వే గేట్లు మరియు రెగ్యులేటర్ గేట్లు పూర్తిగా మూసివేసి ఉన్నాయని అధికారులు తెలిపారు.




