Karimnagar: శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

Karimnagar: మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Updated on: 30 May 2026 2:46 PM IST
Karimnagar
X

Karimnagar: శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు జన్మదినం పురిష్కరించుకొని కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ బాబు జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు యువతకు ఆదర్శమని కొనియాడారు. మంత్రి జన్మదిన సందర్భంగా నగరంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారని అందులో భాగంగా నేడు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్, రెడ్ క్రాస్ సొసైటీ వారు, ACP రూరల్ జి.విజయ్ కుమార్, మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి.కేశవరెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ MLN రెడ్డి, 28 డివిజన్ కార్పొరేటర్ భాస్కర్ నాయక్, బిసి విద్యార్థి సంఘం నాయకులు నారోజు రాకేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story