Karimnagar: కాశ్మీర్ గడ్డలో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటన!
Karimnagar: మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ కాశ్మీర్ గడ్డ రైతు మార్కెట్ పరిశీలించి, ఆగస్టులో ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Karimnagar: కాశ్మీర్ గడ్డలో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటన!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ మార్కెట్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరియు ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి & డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
నూతనంగా నిర్మించనున్న కాశ్మీర్ గడ్డలోని రైతు మార్కెట్ లో మిగిలిపోయిన పనులను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఆగస్టు నెలలో ఈ మార్కెట్‌ను ప్రారంభించేలా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని వారు స్పష్టం చేశారు.
అనంతరం గతంలో పద్మనగర్‌లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈ మార్కెట్‌ను వినియోగంలోకి తేవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో విజిట్ చేసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో 61వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అథీఫ్, పలువురు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




