Karimnagar: కరీంనగర్ విలీన గ్రామాలకు మహర్దశ.. మేయర్ కీలక ప్రకటన!
Karimnagar: నగరంలోని 19, 21వ డివిజన్లలో రూ.19 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమి పూజ చేశారు.
Karimnagar: కరీంనగర్ విలీన గ్రామాలకు మహర్దశ.. మేయర్ కీలక ప్రకటన!
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని 19 వ డివిజన్ 21వ డివిజన్లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్. 19 వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సుధాగోని మాధవి కృష్ణ గౌడ్, డిప్యూటీ మేయర్ తో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 21వ డివిజన్లో మున్సిపల్ సాధారణ నిధులు 19 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ వారాల నర్సింగ్ మున్సిపల్ అధికారులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజ సమస్యలు విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. డివిజన్లో అభివృద్ధితోపాటు సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గం పనిచేస్తుందని, ఎలాంటి సమస్యలున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం ప్రధమ పౌరుడిగా నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.
పనులలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజల అవసరాల కోసం వినియోగంలోకి తేవాలని మున్సిపల్ అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ 19వ డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ ప్రజలు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




