Karimnagar: కరీంనగర్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మేయర్ శ్రీనివాస్

Karimnagar: కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పలు డివిజన్లలో సీసీ రోడ్లు, మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 Sept 2026 1:01 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మేయర్ శ్రీనివాస్

Karimnagar: కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.

నగరంలోని 21వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న బాత్రూమ్ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం 44వ డివిజన్ శ్రీనగర్ కాలనీలోని సంతోషిమాత ఆలయం వద్ద చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

తదుపరి 62వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ తదితర సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల సహకారంతో కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వరాల నర్సింగం, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, పెద్దపెల్లి శ్రీలేఖ జితేందర్, గాజా రామ శివరాం, కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, బీజేపీ నాయకులు కొండపల్లి సతీష్, బండి ప్రమోద్, కపిల్, మహేష్, దీపు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆయా డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story