Manthani: కమాన్‌పూర్‌లో అక్రమంగా తరలిస్తున్న 127 యూరియా బస్తాల పట్టివేత

Manthani: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 127 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాహనం, డ్రైవర్ అదుపులోకి.

SHANKAR, MANTHANI
Published on: 12 Aug 2026 11:53 PM IST
Manthani
X

Manthani: కమాన్‌పూర్‌లో అక్రమంగా తరలిస్తున్న 127 యూరియా బస్తాల పట్టివేత

మంథని: అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 127 యూరియా బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. కమాన్‌పూర్ మండలం ముల్లగుల్ల గ్రామ శివారులోని RS Traders and Contracts వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు కమాన్‌పూర్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌ఐ అశోక్, ఎస్‌ఐ రమేష్‌తో పాటు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 127 యూరియా బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. *Ashok Leyland బడా డోస్ట్ ట్రక్ (నంబర్ TG22 T 1361)*లో RFCL కంపెనీకి చెందిన 80 యూరియా బస్తాలు, IPL కంపెనీకి చెందిన 47 యూరియా బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 127 యూరియా బస్తాల విలువ సుమారు రూ.33,845గా పోలీసులు తెలిపారు.

అనుమతి పత్రాలు లేకుండా యూరియాను తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తనిఖీలను పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పర్యవేక్షించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story