Kamanpur: శ్రీ ఆదివరాహస్వామిని దర్శించుకున్న మంథని మున్సిపల్ చైర్మన్

Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలో స్వయంభు శ్రీ ఆదివరాహస్వామిని దర్శించుకున్న మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ దంపతులు.

SHANKAR, MANTHANI
Published on: 16 Aug 2026 7:25 PM IST
Kamanpur
X

Kamanpur: శ్రీ ఆదివరాహస్వామిని దర్శించుకున్న మంథని మున్సిపల్ చైర్మన్

కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివరాహస్వామిని ఆదివారం మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్ దగ్గరుండి వారికి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు రామానుజాచార్యులు వేదమంత్రోత్సవాల మధ్య ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందజేశారు.

అనంతరం మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్ స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి శాల్వతో ఘనంగా సన్మానించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story