Manthani: మంథని హైవేపై బీఆర్‌ఎస్ రచ్చ నడిరోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే

Manthani: కేటీఆర్ పర్యటన వేళ మంథనిలో తీవ్ర ఉద్రిక్తత. వాహనాలను అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు హైవేపై ధర్నాకు దిగాయి.

SHANKAR, MANTHANI
Published on: 5 July 2026 1:08 PM IST
Manthani
X

Manthani: మంథని హైవేపై బీఆర్‌ఎస్ రచ్చ నడిరోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే 

Manthani: కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించేందుకు వస్తున్న కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో మంథనిలో నిరసన చెలరేగింది.

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో మంథని–కాటారం ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు వస్తున్న కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ శ్రేణులు నడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల తీరును ఖండించారు. ఈ ధర్నాలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత సుంకే రవిశంకర్ వాహనాన్ని పోలీసులు అక్కడి నుండి కన్నేపల్లి కి పంపించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story