Manthani: మంథనిలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ!

Manthani: మంథనిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. RDO కార్యాలయంలో సురేష్, మున్సిపల్ ఆఫీస్‌లో చైర్మన్ శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ.

SHANKAR, MANTHANI
Updated on: 15 Aug 2026 2:49 PM IST
Manthani
X

Manthani: మంథనిలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించిస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో సురేష్, సివిల్ కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి భవాని, తహసీల్దార్ కార్యాలయంలో మొహద్. అరీఫుద్దీన్, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు,స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో అలరించారు. కాకతీయ టెక్నో హైస్కూల్‌లో చిన్నారులతో ఏర్పాటు చేసిన వినూత్న శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అంశాలను శకటం ద్వారా ప్రదర్శించడంతో పాటు చిన్నారులు వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్డీవో సురేష్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని అన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశ ప్రగతిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, క్రమశిక్షణ, దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story