Manthani: గుమ్మనూరు వద్ద బండరాయికి రోల్డ్ గోల్డ్ పుస్తెల తాడు!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుమ్మనూరు గ్రామ శివారులో అమావాస్య రోజు బండరాయికి తాళిబొట్టు కట్టి ఉండటం తీవ్ర కలకలం రేపింది.
Manthani: గుమ్మనూరు వద్ద బండరాయికి రోల్డ్ గోల్డ్ పుస్తెల తాడు!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుమ్మనూరు గ్రామ శివారులో తాళిబొట్టు కలకలం రేపింది. గుమ్మనూరు నుంచి తోట గోపయ్యపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో ఓ బండరాయికి పుస్తెలతాడు వేసి ఉండటాన్ని స్థానిక మహిళలు గుర్తించారు. వెంటనే విషయాన్ని గ్రామ సర్పంచ్ సురేష్ దృష్టికి తీసుకెళ్లారు.
అమావాస్య రోజు కావడంతో ఈ ఘటనపై గ్రామంలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అక్కడ కేక్ కోసుకొని సంబరాలు చేసుకున్నట్లు ఆనావాళ్లు కనిపించాయి. అనంతరం బండరాయికి ఉన్న పుస్తెల తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తాళిబొట్టు కూడా రోల్డ్ గోల్డ్ కావడం అందరని ఆశ్చర్యపరిచింది.
ఈ తాళిబొట్టు అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు వదిలి వెళ్లారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




