Tangallapalli: సిరిసిల్ల కాంగ్రెస్‌లో జోష్: నూతన మండల అధ్యక్షుడు!
Tangallapalli: మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మునిగేలా రాజు.. నియోజకవర్గ ఇన్‌చార్జి కే.కే. మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Tangallapalli: సిరిసిల్ల కాంగ్రెస్‌లో జోష్: నూతన మండల అధ్యక్షుడు!
తంగళ్లపల్లి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మునిగేలా రాజు, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ జె (టోనీ) ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కే.కే. మహేందర్ రెడ్డిని నామాపూర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కే.కే. మహేందర్ రెడ్డి శాలువాతో మునిగేలా రాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
మునిగేలా రాజు మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




