Manakondur: ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర విమర్శలు

Manakondur: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బూతులు తిట్టడంలో రారాజు అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 8 Sept 2026 6:58 PM IST
Manakondur
X

Manakondur: ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర విమర్శలు

మానకొండూర్: బూతులు తిట్టడంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రారాజు అని, ఆయనతో తనను పోల్చవద్దని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని నియోజకవర్గ బీఆర్ఎస్ ఆఫీసులో పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను ప్రభుత్వ పాలసీని ఎండగడ్తూ అభివృద్ది, సంక్షేమంపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కవ్వంపల్లి తనను బూతులు తిట్టాడని, అందుకే తాను తిరిగి తిట్టాల్సి వచ్చిందన్నారు. అసెంబ్లీలో దళితులను అవమానపరచినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి తనను ఎందుకు తిడుతున్నాడని రసమయి ప్రశ్నించారు.

వంద రోజుల్లో గ్యారంటీ, హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజులైనా చేయకపోవడంతో నిరసనలు వ్యక్తం చేశామని, దమ్ముంటే వీటిని అమలు చేయాలని, నియోజకవర్గంలో రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా పని మీద దృష్టి పెట్టాలని, తనను తిట్టుడు మానుకోవాలని, ఒకటి తిడితే వంద తిడుతానంటూ రసమయి అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై నిరసనగా నల్ల బట్టలు వేసుకుని అసెంబ్లీకి వెళితే రేవంత్ సర్కారు అడ్డుకోవడం దుశ్చర్యని, మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరు సరికాదని, కాంగ్రెస్ వారంటేనే కౌరవులని ఆరోపించారు. పెన్షన్ 4వేలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, మహిళలకు 2500, తులం బంగారం, స్కూటీ, అభయహస్తం హామీలు ఇవ్వని కాంగ్రెస్ వారు ఎందుకు సంబరాలు చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనకు ఊరూరా పాడె కట్టి, చావు డప్పు కొట్టి, దినవార కార్యక్రమాలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ప్రజావాణిలో వినతులు ఇచ్చి సక్సెస్ చేశారని తెలిపారు. రాబోవు రోజుల్లో కేసీఆర్ బయటకు వస్తాడని, ఆయన వచ్చిన రోజు కాంగ్రెస్ కి ఆఖరి రోజు అవుతుందని స్పష్టం చేశారు.

జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, భాగస్వాములైన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు,బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, పాకాల మహిపాల్ రెడ్డి, గంప వెంకన్న, లింగాల లక్ష్మణ్, గుర్రం కిరణ్ గౌడ్,తిరుపతి, గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story