Thimmapur: ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్యలపై రసమయి ఆగ్రహం
Thimmapur: టీచర్లను ఉద్దేశించి బోడి టీచర్ అని మాట్లాడిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి క్షమాపణ చెప్పాలని తిమ్మాపూర్‌లో రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
Thimmapur: ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్యలపై రసమయి ఆగ్రహం
తిమ్మాపూర్: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాటలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పార్టీ కార్యాలయంలో రసమయి మీడియా సమావేశంలో మాట్లాడారు. గురుపూజోత్సవం రోజున గురువులను సన్మానించకుండా బోడి టీచర్ అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడటాన్ని రసమయి ఖండించారు. వెంటనే ఆయన గురువులకు క్షమాపణ చెప్పి వారి చెప్పులతో చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు.
కవ్వంపల్లి కండ్లకు పొరలు వస్తే తొలగించుకోవాలని సూచించారు. 33నెలల్లోనే కవ్వంపల్లికి ఎక్కడా లేని అహంకారం వచ్చిందని ఆరోపించారు. తాను ఉపాధ్యాయునిగా పని చేసి, తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడితోనే పాటలు పాడుతూ కోట్లాది మందిని చైతన్యం చేస్తేనే రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఇంజినీర్లను, సైంటిష్టులను, డాక్టర్లను, కళాకారులను తయారు చేసిన టీచర్ల భిక్షతోనే డాక్టర్ అయినది మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. తాను 2010లోనే రెండు కోట్లతో సినిమా తీసినట్లు గుర్తు చేశారు.
ఓటు కోసం పచ్చునూర్ లో పేరు రాసుకున్న చరిత్ర అని, మీ తాత, ఆయన తండ్రి పేరు చెప్పాలని కవ్వంపల్లిని రసమయి డిమాండ్ చేశారు. మీ అమ్మనాన్నలు సఫాయి పని చదివిస్తే నువ్వు మాట్లాడేది.. ఇదా.... అంటూ రసమయి మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనల తిట్టుడే తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఒక్క కోటి రూపాయల పనైనా చేసినట్లు చూపిస్తావా అంటూ ప్రశ్నించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయిని వెంకట్ రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, గంప వెంకన్న, తాట్ల తిరుపతి,పొన్నం అనిల్ గౌడ్,వంతడుపుల సంపత్, మ్యాకల మహేష్, సుధగోణి సదయ్య, మాశెట్టి శివ కృష్ణ, మ్యాకల సునీల్,బిఅర్ఎస్ నాయకులు ఉన్నారు.




