Jagtial: మెడకు చున్నీ బిగించి హతమార్చిన వాచ్‌మెన్ నరేష్!

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రకాశం రోడ్డులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య లక్ష్మి మెడకు చున్నీ బిగించి హత్య చేసిన భర్త నరేష్, పోలీసులు కేసు నమోదు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2026 11:18 AM IST
Jagtial
X

Jagtial: మెడకు చున్నీ బిగించి హతమార్చిన వాచ్‌మెన్ నరేష్!

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.కట్టుకున్న భార్యపై కర్కశత్వం చూపిన భర్త. మెడకు చున్నీ బిగించి ఆమెను ప్రాణాల్లేకుండా చేశాడు.

ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న అన్నం నరేష్,లక్ష్మి దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. నరేష్ కథలాపూర్ సబ్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చెలరేగింది.

గొడవ తారాస్థాయికి చేరడంతో క్షణికావేశానికి లోనైన నరేష్ భార్య లక్ష్మి మెడకు చున్నీ గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.స్థానికుల సమాచారంతో కోరుట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు‌.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్