Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్యాయత్నం!

Sircilla: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతున్న రోగి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యుల వెల్లడి.

KALEEM, SIRICILLA
Published on: 2 Sept 2026 6:51 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్యాయత్నం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి కిందికి దూకిన ఘటన చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన 35 ఏళ్ల గేరు గంటి రాజు, తండ్రి అంజయ్య, కడుపునొప్పితో తన భార్య కావ్య, కుమారుడితో కలిసి ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న రాజు సాయంత్రం సమయంలో తన కుమారుడికి టిఫిన్ తీసుకొస్తానని బయటకు వెళ్లి తిరిగి ఆస్పత్రికి వచ్చాడు.

అనంతరం కొంతసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాజు.. రాత్రి సుమారు 9 గంటల 10 నిమిషాల సమయంలో ఏదో కనిపిస్తున్నట్లు భావిస్తూ ఆస్పత్రి పైభాగం నుంచి కిందికి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజుకు కాళ్లకు, గడ్డం కింద భాగంలో గాయాలయ్యాయి. ఎడమ నడుము వద్ద ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం రాజుకు చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ప్రాణాపాయం లేదని సమాచారం. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, ఆస్పత్రి అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story