Huzurabad: ఇందిరానగర్‌లో పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన మధురమ్మ ట్రస్ట్

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం శాలపల్లి-ఇందిరానగర్‌లో మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 6 Sept 2026 5:37 PM IST
Huzurabad
X

Huzurabad: ఇందిరానగర్‌లో పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన మధురమ్మ ట్రస్ట్

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గం ఇంద్రనగర్ పేద వృద్ధ మహిళలకు మధురమ్మ ట్రస్ట్ చేయూత 40 మందికి చీరల పంపిణీ.పేదలు, వృద్ధులకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలో పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

గ్రామపంచాయతీ సూచించిన 40 మంది పేద వృద్ధ మహిళలకు ట్రస్ట్ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, సర్పంచ్ కోడిగూటి కిరణ్ చేతుల మీదుగా చీరలు అందజేశారు.వృద్ధుల సంక్షేమం మనందరి బాధ్యత సర్పంచ్ కోడిగూటి కిరణ్ పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు, సామాజిక సేవలో భాగంగా పేద వృద్ధ మహిళలకు ట్రస్ట్ అందించిన సహకారం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కే. శ్రీధర్ రెడ్డి, జీవన్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story