Sircilla: చంద్రంపేట వద్ద నిత్యం ప్రమాదాలు స్పందించని R&B అధికారులు!
Sircilla: చంద్రంపేట–ముష్టిపల్లి బైపాస్ చౌరస్తాలో ప్రమాదాల నివారణకు వెంటనే స్పీడ్ బంప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Sircilla: చంద్రంపేట వద్ద నిత్యం ప్రమాదాలు స్పందించని R&B అధికారులు!
Sircilla: చంద్రంపేట–ముష్టిపల్లి బైపాస్ చౌరస్తా వద్ద ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రగుడు నుంచి వెంకటాపూర్, కామారెడ్డి వైపు వెళ్లే వాహనాలు, కామారెడ్డి నుంచి రగుడు వైపు వచ్చే వాహనాలు వేగంగా దూసుకురావడంతో పాత చంద్రంపేట రోడ్డుపై నుంచి వచ్చే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూటర్న్ ఉన్న ప్రాంతంలో స్పీడ్ బంప్స్ ఏర్పాటు చేయాలని పలుమార్లు ఆర్‌అండ్‌బీ అధికారులకు విన్నవించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యను ఫోన్ ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నించినా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు.ఇప్పటికే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. మరో ప్రాణం పోయే వరకు అధికారులు వేచి చూస్తారా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు యూటర్న్ వద్ద వెంటనే స్పీడ్ బంప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే చర్యలు తీసుకుని ప్రాణనష్టం నివారించాలని కోరుతున్నారు.ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




