Sircilla: 210 నిమిషాల్లో 5.5 మీటర్ల చీర నేత ప్రదర్శన!

Sircilla: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రదర్శన చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Aug 2026 10:14 AM IST
Sircilla
X

Sircilla: 210 నిమిషాల్లో 5.5 మీటర్ల చీర నేత ప్రదర్శన!

Sircilla: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశిష్ట చేనేత ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

సిరిసిల్ల పట్టణంలోని జ్యోతి నగర్‌లో ఉన్న హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్‌లో జరిగే ఈ ప్రదర్శనలో సంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 210 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల చేనేత చీరను ప్రత్యక్షంగా నేయనున్నారు.

అనంతరం అదే చీరను ప్రత్యేక నైపుణ్యంతో మడిచి 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడంతో పాటు యువతలో చేనేతపై ఆసక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకుడు వెల్ది హరిప్రసాద్ తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story