Karimnagar: ఇంద్రసేన మృతి పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి.. ధైర్యంగా ఉండాలని ఓదార్పు!
Karimnagar: కరీంనగర్ అల్గునూర్ బిఆర్ఎస్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం సోదరుడు ఇంద్రసేన అకాల మరణం పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Karimnagar: ఇంద్రసేన మృతి పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి.. ధైర్యంగా ఉండాలని ఓదార్పు!
Karimnagar: అల్గునూర్ 8వ డివిజన్‌కు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాల్వ మల్లేశం సోదరుడు ఇంద్రసేన ఇటీవల అకాల మరణం చెందాడు..
ఈ నేపథ్యంలో, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలసి వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు..
ఇంద్రసేన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు…
ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు…
ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, మండల అధ్యక్షులు రావుల రమేష్,రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సల్ల మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




