Choppadandi: ముంపు బాధితుల సమస్యలను కేటీఆర్ వద్దకు చేర్చిన జయపాల్ రెడ్డి!
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది.
Choppadandi: ముంపు బాధితుల సమస్యలను కేటీఆర్ వద్దకు చేర్చిన జయపాల్ రెడ్డి!
Choppadandi: నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులకు బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి అండగా నిలిచారు. కరీంనగర్ లో నిర్వహించిన యువ గర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ హాజరయ్యారు. నగరంలోని త్రిదా హోటల్లో కేటీఆర్ ను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపూర్ ముంపు గ్రామ బాధితులను ఆయన కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
ముంపు గ్రామ బాధితుల సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నారాయణపూర్ గ్రామస్తుల సమస్యలను సమూలంగా వివరించారు. కాగా సానుకూలంగా స్పందించిన కేటీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముంపుగ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. నారాయణ పూర్ గ్రామస్తులకు అండగా నిలుస్తానని... జయపాల్ రెడ్డి భరోసా కల్పించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం ముంపుగ్రామ బాధితులకు బోజన వసతి కల్పించారు.




