Sircilla: కొత్వాల్ వెంకటరామారెడ్డి 157వ జయంతి వేడుకలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 22 Aug 2026 4:10 PM IST
Sircilla
X

Sircilla: కొత్వాల్ వెంకటరామారెడ్డి 157వ జయంతి వేడుకలు!

సిరిసిల్ల: కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి 157వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటరామారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఇటీవల విద్యార్థుల చేతిలో హత్యకు గురైన ఉపాధ్యాయురాలు రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు దైవంగా భావించే ఉపాధ్యాయురాలిని హత్య చేయడం అత్యంత బాధాకరమన్నారు. నవ సమాజ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమని, వారి చేతుల్లోనే భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే తమ భవిష్యత్తుపై దృష్టి సారించి, వ్యసనాలకు, చెడు మార్గాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం కోర్ కమిటీ సభ్యులు న్యాలకొండ రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, కోశాధికారి ఎడ్మల హనుమంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కంకణాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు ఉప్పల లక్ష్మారెడ్డి, అక్కపెళ్లి రాజనర్సింహారెడ్డి, బద్దం నాగిరెడ్డి, అక్కపెళ్లి నవీన్ రెడ్డి, దుండ్రా ఆదిరెడ్డి, పుట్ట నారాయణరెడ్డి, బైరి శ్రీహరిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story