Sircilla: రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా కొండ రమేష్ గౌడ్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Sircilla: రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా కొండ రమేష్ గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌కు రాష్ట్ర స్థాయిలో అరుదైన పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు జిల్లాలు, మండలాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సర్పంచుల సమస్యలను రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
తనకు రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు చక్కటి వెంకటేష్ యాదవ్‌తో పాటు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏటి యాదవ్‌కు కొండ రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.




