Sircilla: నిద్రపోతున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఘోరం. జాలీగా తిరుగుతూ వేధిస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి.
Sircilla: నిద్రపోతున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొడుకును గొడ్డలితో నరికి చంపేందుకు ప్రయత్నించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మల్కపేట గ్రామానికి చెందిన గుడిపేట రాఘవులు అలియాస్ రాఘవరెడ్డికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాజేందర్ ఎలాంటి పని చేయకుండా తండ్రిని వేధిస్తూ, కొడుతూ, అప్పులు చెల్లించకుండా తరచూ గొడవలకు దిగేవాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఆగస్టు 8న ఫ్యాన్ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరగగా.. రాజేందర్ తండ్రిపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా విసిగిపోయిన రాఘవరెడ్డి.. అదే రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నిద్రపోతున్న రాజేందర్‌పై గొడ్డలితో తల, ముఖంపై దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేందర్‌ను చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రవీందర్ నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసిన ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని సీఐ రవీందర్ అభినందించారు.




