Karimnagar: కేటీఆర్ కరీంనగర్ రాకపై నరేందర్ రెడ్డి ధ్వజం!
Karimnagar: ఫీజు రీయింబర్స్మెంట్, పేపర్ లీకేజీలపై సమాధానం చెప్పిన తర్వాతే కేటీఆర్ కరీంనగర్‌లో మాట్లాడాలని సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Karimnagar: కేటీఆర్ కరీంనగర్ రాకపై నరేందర్ రెడ్డి ధ్వజం!
Karimnagar: ఫీజ్ రీయంబర్స్ మెంట్, జాబ్ క్యాలెండర్ పై మాట్లాడడానికి కరీంనగర్ వస్తున్న కేటి రామారావు మొదట వీటన్నిటికి సమాధానం చెప్పి మాట్లాడాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు మీ హాయంలో 5 వేల కోట్ల ఫీజ్ రీయంబర్స్ మెంట్ పెండింగ్ కుప్ప ఎందుకు పెట్టిండ్రు మొదలు సమాధానం చెప్పాలని అన్నారు.ఇంటర్ పలితాలు తప్పుగా ప్రకటించినందు వల్ల 24 మంది విద్యార్థులు మానసికంగా కృంగి పోయి వారి మరణానికి కారణమైంది మీరు కాదా మొదలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
గ్రూప్ పరీక్షలు లీకు కావడం వల్ల కష్టపడి చదువుకుని పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థుల నిరుద్యోగుల మానసిక క్షోభకు భాద్యులు ఆనాడు మీరు కాదా మొదలు దీనికి సమాధానం చెప్పాలని కోరారు. 2014, 2018 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసి ఇవ్వకుండా మోసం చేసింది చాలక పోటీ పరీక్షల లీకేజీ చేసి మానసిక క్షోభకు కారణం మీరే కదా దీనికోసం నిరుద్యోగు మొదలు దీ సమాధానం చెప్పాలి.
KG నుండి PG వరకు ఉచిత విద్య ఇస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేసింది మీరే కదా, ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి నేడు మీరు ప్రశ్నిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మీ హాయంలో యూనివర్సిటీలకు పూర్తి స్థాయి వీసీ లను ఎందుకు నియమించలేదు ఇంచార్జి వీసీ ల ద్వారానే ఎందుకు నడిపించిండ్రు దీనికి బాధ్యులు మీరు కాదా అన్నారు. బకాయిలను పెండింగ్లో పెట్టి నాటినుండి నేటి వరకు విద్యార్థులను వారి జీవితాలతో చెలగాటమాడి నేడు ముసలి కన్నీరు కారుస్తూ విద్యార్థుల కోసం ఉద్యమాలు చేస్తామనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




