Peddapalli: కొలనూరు రైల్వే స్టేషన్‌లో పలు రైళ్ల నిలుపుదలకు కాంగ్రెస్ వినతి!

Peddapalli: కొలనూరు రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల, మౌలిక వసతుల కల్పనపై దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు కాంగ్రెస్ నేత బైరీ రవి గౌడ్ వినతిపత్రం.

Srimanthula Kondal, Peddapalli
Published on: 29 Aug 2026 6:43 PM IST
Peddapalli
X

Peddapalli: కొలనూరు రైల్వే స్టేషన్‌లో పలు రైళ్ల నిలుపుదలకు కాంగ్రెస్ వినతి!

Peddapalli: కాజీపేట -రామగుండం రైలు మార్గంలోని ముఖ్య రైల్వే స్టేషన్ కొలనూరు లో పళ్ళు రైళ్ల నిలుపుదల కోసంతో పాటు రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ, డిఆర్ఎం గోపాల కృష్ణ ల కు వినతిపత్రం అందించారు.

సాయంత్రం కాజీపేట రైల్వే స్టేషన్ లో గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి బైరీ రవి గౌడ్, డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ తో కలిసి ఆయన వినతి పత్రం అందించి కొలనూరు రైల్వేస్టేషన్లో సమస్యలను వివరించారు.

రైల్వే స్టేషన్లో బల్లార్షా కాజీపేట ఎక్స్ప్రెస్ రైలు కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కరీంనగర్ తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నిలుపు గల తో పాటు రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నాలుగు మండలాలకు 40 గ్రామాలకు ముఖ్య కూడలి ప్రాంతమైన కొలనూరు రైల్వే స్టేషన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినత్పత్రం అందించినట్లు బైరి రవి గౌడ్ పేర్కొన్నారు. వారితోపాటు సట్ల సదయ్య గౌడ్,గుంజపడుగు శ్యామ్, మాచర్ల వినోద్, వేముల నరేష్ తదితరులు ఉన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story