Kodimial: కాంగ్రెస్ హామీలపై నిరసన - మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
Kodimial: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో రైతులను విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు.
Kodimial: కాంగ్రెస్ హామీలపై నిరసన - మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కోడిమ్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, BRS నేత సుంకె రవిశంకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కోడిమ్యాల అంబేద్కర్ చౌరస్తాలో BRS ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు రూ.15 వేల రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని మభ్యపెట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని ఆరోపించారు.
రుణమాఫీ కాక, ఎరువులు లభించక రైతులు మళ్లీ సావకార్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. KCR హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్‌తో వ్యవసాయం పండుగలా సాగిందని, ఇప్పుడు నీళ్లు లేక నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల తరఫున BRS పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




