Karimnagar: కరీంనగర్‌లో యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశం

Karimnagar: కరీంనగర్ వాగేశ్వరి కళాశాలలో యుఎస్‌ఎఫ్‌ఐ సమావేశం. విద్యాసంస్థల సమస్యలపై ప్రభుత్వానికి హెచ్చరిక. హాజరైన రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Aug 2026 3:16 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశం

కరీంనగర్: భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం కరీంనగర్ పట్టణంలోని స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధ్యక్షులు మనీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్ లను సిబిఎస్ స్కూల్లో గా మార్చే ప్రతిపాదన స్వాగతిస్తున్నామని కానీ వసతులను కల్పించకుండా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఇది ఎలా సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా అనేక కళాశాల నడుస్తున్నాయని ఒకే కళాశాల పేరుతో అనేక బ్రాంచ్ నడుపుతున్న స్థానిక విద్యాధికారులు పట్టించుకోకపోవడంలో అంతర్యమేమిటి అని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్న అధికారులు మాత్రం కాలయాపన చేయడం ప్రశ్నించారు.

నగరంలో అనేక కళాశాలలో ఒకే కాలేజ్ పేరుతో అనేక క్యాంపస్ నడుపుతున్నారని వీటిపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా సమస్యలు ఉన్నాయని వీటిపై తక్షణమే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా లోకల్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని కానీ అందులో కూడా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సు నడిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. డిగ్రీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేక అనేకమంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని కాబట్టి విద్యార్థులకు సంఖ్యా కనుగుణంగా హాస్టల్లో ఏర్పాటు చేయాలని కోరారు.

జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులపై కలెక్టర్ స్పందించి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ కళాశాలల దోపిడీ అడ్డు అదుపు లేకుండా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాధికారులు జిల్లా యంత్రాంగం స్పందించకుంటే భవిష్యత్తులో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి సంద గణేష్ , జిల్లా నాయకులు హేమంత్, అరుణ్ మధు కుమార్, నాయక్, సాత్విక్, అఖిల్ ,శనివిక్ నైనేష్ , తిరుపతి, హరికృష్ణ, ప్రణయ్, అక్షయ శివరాజ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story